టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కొచ్చిలోని ఎడపల్లీలో ఉన్న క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో గ్రౌండ్ ప్లోర్ పూర్తిగా పూర్తిగా దగ్ధమైంది.
గ్రౌండ్ ప్లోర్‌లోనే హాలు, బెడ్ రూమ్ ఉన్నాయి. అయితే, ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్ని ప్రమాదం చోటుకున్న సమయంలో శ్రీశాంత్ మాత్రం ఇంట్లో లేడు. మంటలు వ్యాపించిన సమయంలో ఇంట్లో శ్రీశాంత్ భార్య, పిల్లలతో పాటు ఇద్దరు పని మనుషులు ఉన్నారు.
#CricketerSreesanth
#SreesanthHouse
#CricketerSreesanthhouseKochi
#teamindia
#cricket